అడిగినదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలు : మంత్రి హరీష్‌ రావు

Minister Harish Rao Comments On AP Leaders. తెలంగాణ మంత్రి హరీష్‌ రావు సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై మరోసారి ఫైర్‌ అయ్యారు.

By Medi Samrat  Published on  17 April 2023 7:30 PM IST
అడిగినదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలు : మంత్రి హరీష్‌ రావు

Minister Harish Rao


తెలంగాణ మంత్రి హరీష్‌ రావు సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై మరోసారి ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొందరు నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, ఉన్నది అంటే ఉలుక్కి పడుతున్నారని అన్నారు. ఏపీ మంత్రులు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదంటూ మంత్రి ప్రశ్నించారు. తాను ఏపీని కించ పరచే విధంగా మాట్లాడాను అని కొందరు నాయకులు అనడం, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు. అడిగినదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. చేతనైతే ప్రత్యేక హోదా కోసం, విశాఖ ఉక్కు కోసం పోరాడాలన్నారు. పోలవరం తొందరగా పూర్తి చేసి కాలేశ్వరం లాగా నీళ్లు అందించండని అన్నారు. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాటం చేయడం లేదు.. పోలవరం పనులు ఎందుకు కావడం లేదని ప్రశ్నించాను. ఇందులో ఏమైనా తప్పుందా.? ప్రజల పక్షాన మాట్లాడాను తప్ప.. ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదని అన్నారు హరీష్ రావు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని.. ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలి అని చెప్పానన్నారు.


Next Story