కరోనా కారణంగా పోలియో కార్యక్రమం ఆలస్యమైంది
Minister Harish Rao begins polio campaign.దేశవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఐదేళ్లలోపు
By తోట వంశీ కుమార్ Published on 27 Feb 2022 6:16 AM GMTదేశవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల పల్స్ పోలియో కార్యక్రమం ఆలస్యమైందన్నారు. మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. 23వేల సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి 28 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదేళ్ల వయస్సు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
ఇక కరోనా వ్యాక్సిన్ లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. కరోనా వాకిన్స్ వేసుకోని వారు ఇప్పుడైనా వేసుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో 350కి పైగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్తీ ధవాఖానాలు ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక్కడ వైద్య సేవలతో పాటు, మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ఇక సాయంకాలం కూడా బస్తీ దవాఖానాలు తెరవాలని సూచించినట్లు చెప్పారు. వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.