దళితబంధు ఇచ్చి తీరుతాం : హరీష్ రావు
Minister Harish Rao About Dalitha Bandhu. ఈ నెల 16న హుజూరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని
By Medi Samrat Published on 14 Aug 2021 8:02 PM IST
ఈ నెల 16న హుజూరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. దళిత బంధు పథకంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని అన్నారు. రైతు బంధుపై దుష్ప్రచారం చేసినట్టే, ఇప్పుడు దళిత బంధుపైనా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దళిత బంధు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలని అన్నారు. ఈ పథకానికి లబ్దిదారుల జాబితా రూపొందించగా.. హుజూరాబాద్ లో దళితులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ స్పందించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అందుతుందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని.. దళిత బంధు అద్భుతమైన పథకం అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 16న హుజూరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కొందరు లబ్దిదారులకు స్వయంగా చెక్కులు అందిస్తారని అన్నారు. దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్ కూడా హుజూరాబాద్ లోనే ఉన్నారు.