ఆంధ్రా పెత్తనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గంగుల

తెలంగాణ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రా పెత్తనం అంటూ

By Medi Samrat  Published on  10 Nov 2023 6:01 PM IST
ఆంధ్రా పెత్తనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గంగుల

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రా పెత్తనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుకొని హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని గంగుల కమలాకర్ అన్నారు. కాంగ్రెస్ లేదా బీజేపీ గెలిస్తే కనుక మళ్లీ ఆంధ్రా పెత్తనం వస్తుందని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో మన భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు గంగుల. తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరే వారికి అధికారం ఇస్తే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. హైదరాబాద్ సంపద మీద ఆంధ్రా నేతల కన్ను పడిందని.. కేసీఆర్ మళ్లీ గెలవకుంటే ఇక్కడి సంపదను అంతటినీ వారు తీసుకు వెళ్తారన్నారు. వెలుగులు విరజిమ్ముతున్న తెలంగాణను మళ్లీ గుడ్డి దీపంగా మార్చుతారన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసి కేసీఆర్‌కు పట్టం కట్టాలన్నారు.

Next Story