బీజేపీ నేతపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ మంత్రి గంగుల

Minister Gangula Kamalakar Complaints On BJP Leader. పరువుకు భంగం కలిగించేలా ఆరోప‌ణ‌లు చేసిన‌ బీజేపీ నేత, న్యాయవాది బేతి మహేందర్

By Medi Samrat  Published on  7 Aug 2021 2:46 PM GMT
బీజేపీ నేతపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ మంత్రి గంగుల

పరువుకు భంగం కలిగించేలా ఆరోప‌ణ‌లు చేసిన‌ బీజేపీ నేత, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఫిర్యాదు మేరకు క‌రీంన‌గ‌ర్‌ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రానైట్ వ్యాపారంలో గంగుల కమలాకర్ పన్నులు ఎగవేశారని బేతి మహేందర్ రెడ్డి ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ఈ మేర‌కు తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, పరువుకు నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌. సోషల్ మీడియా, పత్రికల్లో స్టేట్ మెంట్స్ ఇచ్చారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మంత్రి గంగుల కమలాకర్ కోరారు. మంత్రి కమలాకర్‌ ఫిర్యాదు మేరకు బీజేపీ నేత మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


Next Story
Share it