రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారులకు త్వరలోనే సరికొత్త బాలామృతం

తెలంగాణలో అంగన్వాడీల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది

By Knakam Karthik
Published on : 4 July 2025 7:18 AM IST

Telangana, Minister Seethakka, Anganwadis, Childrens, Balamrutham

రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారులకు త్వరలోనే సరికొత్త బాలామృతం

తెలంగాణలో అంగన్వాడీల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చిన్నారుల్లో పోషకాహారాన్ని మెరుగు పరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా అంగన్వాడి కేంద్రాల బలోపేతం, పోషకార మిషన్, ఉద్యోగ ఖాళీల భర్తీ, కారుణ్య నియమకాలు, అంగన్వాడి సేవల్లో మహిళా స్వయం స‌హ‌య‌క బృందాలు, స్వచ్చంద సంస్థలకు భాగస్వామ్యం, చిన్నారుల పోషకాహార మెరుగుదల కోసం అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ అంగ‌న్వాడీల‌ను బ‌లోపేతం చేసే దిశ‌లో ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే బాలామృతంలో ప‌లు మార్పులు చేశారు. నిపుణుల సిఫార్సు మేర‌కు పంచ‌దార‌ లేకుండా స‌రికొత్త బాల‌మృతం ను టీజీ ఫుడ్స్ సిద్దం చేయ‌గా మంత్రి సీత‌క్క రుచి చూసి ప‌లు సూచ‌న‌లు చేశారు. పిల్లల‌కు తీపి అనుభూతి క‌లిగించేలా క‌ర్జూరా పౌడ‌ర్ ను మిక్స్ చేయాల‌ని సూచించారు. త్వర‌లో స‌రికొత్త బాలామృతంను పంపిణీ చేస్తామ‌న్నారు. అంగన్వాడి కేంద్రాల్లో అల్పాహారం కోసం కిచిడీ మిక్స్, ఉప్మా మిక్స్ లకు సిద్ధం చేశారు. వేడి నీటిలో వేసి మ‌రిగించ‌గానే అల్పాహ‌రం సిద్ధమ‌వుతోంది. కిచిడీ మిక్స్, ఉప్మా మిక్స్ ల‌ను టేస్ట్ చేసిన మంత్రి అందులో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.

Next Story