Video: ముగిసిన వివాదం.. మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య

టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమక్షంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు సయోధ్య కుదిరింది.

By -  Knakam Karthik
Published on : 8 Oct 2025 1:02 PM IST

Telangana, Minister Ponnam Prabhakar,Adluri Laxman Kumar, deliberate comments, Congress, Tpcc Chief

Video: ముగిసిన వివాదం.. మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య

హైదరాబాద్: టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమక్షంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు సయోధ్య కుదిరింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రుల మధ్య పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఇతర ముఖ్య నేతలు సయోధ్య కుదిర్చారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,కవ్వంపల్లి సత్యనారాయణ,శివసేన రెడ్డి ,సంపత్ కుమార్, అనిల్ ,వినయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాకు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు..నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్న. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడి లో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు. సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది. మేమంత్న ఐక్యంగా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం. లక్ష్మణ్ గారికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న.. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గం మేమంతా కలిసి పెరిగాం..ఆ అపోహ ఉండవద్ధని విజ్ఞప్తి చేస్తున్న..అని పొన్నం పేర్కొన్నారు.

Next Story