రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం కంటైనర్ బోల్తా పడడంతో వందల లీటర్ల పాలు రోడ్డు పాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిల్క్ లోడ్ కంటైనర్ కందుకూరు నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ సడన్ బ్రేక్‌లు వేయడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో కంటైనర్ బోల్తా పడింది. కంటెయినర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా తప్పుడు దిశలో డ్రైవింగ్ చేశాడని కందుకూరు పోలీసులు తెలిపారు.
కంటైనర్ బోల్తా పడడం.. అందులో నుంచి పాలు కారడం గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున బకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలతో వచ్చి పాలను పట్టుకున్నారు. కందుకూరు పోలీసులు జేసీబీ వాహనంతో కంటైనర్ ను రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఒక్క సారిగా ప్రమాదం జరగడంతో ఆ మహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.