Rain Alert: నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి
Rain Alert: నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపింది.
అలాగే ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్ధిపేట, యాదాదరి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. రేపు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
నిన్న అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌తో సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల వడగండ్లు కురవగా పంట నష్టం ఏర్పడింది. ఈదురుగాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు.