వైద్య విద్యార్ధిని ప్రీతికి కన్నీటి వీడ్కోలు.. స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు

Medico Preeti Funeral Complete. సీనియర్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ

By M.S.R  Published on  27 Feb 2023 4:09 PM IST
వైద్య విద్యార్ధిని ప్రీతికి కన్నీటి వీడ్కోలు..  స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు

సీనియర్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు.

ప్రీతి మృతి కేసులోలో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్‌ను (హెచ్‌ఆర్‌సీ) ఆ‍శ్రయించింది. ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జేఏసీ కోరింది. ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హెచ్‌ఆరీసీలో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్‌ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారని ఫిర్యాదు చేసింది. నిమ్స్‌, గాంధీ ఆసుపత్రిలో పోలీసుల వ్యవహర తీరుపై విచారణ చేపట్టాలని తెలిపింది. ప్రీతికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి.




Next Story