హైదరాబాద్‌లో మెక్ డొనాల్ట్స్ గ్లోబల్ ఆఫీస్..ప్రభుత్వంతో ఒప్పందం

అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌ తమ భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది.

By Knakam Karthik
Published on : 20 March 2025 7:00 AM IST

Telangana, Hyderabad News, MCDonalds Signs Agreement With Govt

హైదరాబాద్‌లో మెక్ డొనాల్ట్స్ గ్లోబల్ ఆఫీస్..ప్రభుత్వంతో ఒప్పందం

అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌ తమ భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్​లో గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో బుధవారం మెక్‌ డొనాల్డ్స్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో రేవంత్‌రెడ్డితో మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్ క్రిస్ కెంప్ కెజెన్ స్కీ తదితరులు సమావేశమయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు.

సుమారు 2 వేల మంది ఉద్యోగులు పనిచేసే గ్లోబల్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేసేందుకు మెక్‌ డొనాల్డ్స్‌ ముందుకు రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పటికీ మెక్ డొనాల్డ్స్‌ సంస్థ హైదరాబాద్‌ను పెట్టుబడుల కోసం ఎంచుకోవడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరించారు.

ప్రస్తుతం తెలంగాణలో 38 అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మరో మూడు లేదా నాలుగు కొత్త అవుట్‌లెట్‌లను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నారు. బెంగళూరు వంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులు, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉన్నందునే నగరాన్ని ఎంచుకున్నట్లు మెక్‌డొనాల్డ్స్‌ చైర్మన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్​ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు వివరించిన క్రిస్ రాష్ట్రంలోనూ అలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 38 అవుట్ లెట్లు ఉన్న మెక్‌ డొనాల్డ్స్ ఏటా మూడు, నాలుగు విస్తరించే ప్రణాళికలున్నట్లుగా మెక్ డొనాల్డ్స్ వెల్లడించారు.

Next Story