తెలంగాణలో ఒకేసారి 47 మంది మున్సిపల్ కమిషనర్లు ట్రాన్స్‌ఫర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఈసీ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసింది. ప్రమోషన్లు, పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో పలువురిని జీహెచ్‌ఎంసీకి పంపగా మరికొందరిని జిల్లాలకు బదిలీ చేసింది.
తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల భారీ బదిలీలురాష్ట్ర వ్యాప్తంగా 40కిపైగా మున్సిపల్ కమిషనర్లకు ట్రాన్స్ఫర్లుGHMC, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కీలక మార్పులుఎన్నికల కోడ్ నేపథ్యంలో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం.GHMCలో పలువురు కమిషనర్లు, మేనేజర్లకు కొత్త బాధ్యతలు pic.twitter.com/uJ07Apri2p