తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా శశాంక్ గోయెల్, GHMC కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్.వెంకటాద్రి, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంక, జెన్‌కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు, పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్, HMDA సెక్రటరీగా ఇలంబర్తిలను నియమించింది.