మంత్రి శశిధర్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. అమిత్ షాను కలవడంతో చర్యలు తీసుకుంది. ఆయన వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆరు సంవత్సరాల పాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక చర్యలతో క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నుండి ఈ ప్రకటన వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కనిపించడంలేదని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బయటికి వస్తున్నట్టు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదని, మునుగోడు ఉప ఎన్నికను ఎంతో తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అందుకు రేవంత్ దే బాధ్యత అని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లతో కలిసి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు.