ప్రియాంక గాంధీ సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తారు

Manikrao Thakre Fire On CM KCR. ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదని ఏఐసీసీ ఇంచార్జీ మానిక్ రావు థాక్రే

By Medi Samrat  Published on  6 May 2023 1:45 PM IST
ప్రియాంక గాంధీ సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తారు

ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదని ఏఐసీసీ ఇంచార్జీ మానిక్ రావు థాక్రే అన్నారు. రాష్ట్రంలో యువత చాలా నిరుత్సాహంతో ఉన్నారని అన్నారు. ప్రియాంకా గాంధీ.. సభ ద్వారా ప్రభుత్వం ఉద్యోగ కల్పన లో జరిగిన అన్యాయం పై మాట్లాడుతారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే ఉద్యోగ కల్పన లో ఏం చేయబోతున్నామో చెబుతారన్నారు. ఈ సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని పేర్కొన్నారు.

యువత కాంగ్రెస్ పై నమ్మకంతో ఉన్నారన్నారు. అన్ని వర్గాల నిరుద్యోగ యువత ప్రియాంకా గాంధీ సభ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత ఆకాక్షల మేరకు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు. కానీ 9 ఏళ్లలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయంలోనేన‌ని పేర్కొన్నారు. 9 సంవత్సరాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని.. కేసీఆర్ పాలనలో ఉద్యోగ కల్పన జరుగలేదని విమ‌ర్శించారు.



Next Story