మంచులక్ష్మి తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మన ఊరు మన బడి కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందని మంచు లక్ష్మి ప్రశంసించారు. గత ఏడు సంవత్సరాల నుంచి మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ట్రస్ట్ తరఫున పలు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పడమే కాకుండా ఆయా రంగంలో ప్రతిభావంతులైన వారి చేత కూడా పాఠాలను చెప్పిస్తున్నారు. ఇలా పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా డ్రాపౌట్ స్టూడెంట్స్ శాతం పూర్తిగా తగ్గిపోయిందని మంచు లక్ష్మి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈమె తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనలైజింగ్ గురించి మాట్లాడుతూ ఐసీటీ ట్రైనర్ల వల్ల విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తే వచ్చే మూడు సంవత్సరాలలో విద్యా రంగంలో ఎంతో గణనీయమైన మార్పులు వస్తాయని అన్నారు.