Telangana: మహిళతో అసభ్య ప్రవర్తన.. పోలీస్ స్టేషన్‌ను క్లీన్‌ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం

రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఎల్‌బి నగర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌ను శుభ్రం చేసి జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

By అంజి
Published on : 27 March 2025 12:20 PM IST

Telangana, clean, Police Station, fine, abusing woma, Gurramguda

Telangana: మహిళతో అసభ్య ప్రవర్తన.. పోలీస్ స్టేషన్‌ను క్లీన్‌ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం

రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఎల్‌బి నగర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌ను శుభ్రం చేసి జరిమానా చెల్లించాలని ఆదేశించింది. గుర్రంగూడకు చెందిన సంధ్య.. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

అదే ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల రమేష్ అనే వ్యక్తి గొడవ సమయంలో అసభ్యకరమైన భాషను ఉపయోగించి తనను ఇబ్బంది పెట్టాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేసిన తర్వాత, పోలీసులు రమేష్‌ను కోర్టులో హాజరుపరిచారు. శిక్షలో భాగంగా రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌ను శుభ్రం చేయడం ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్‌లో పాల్గొనాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. అదనంగా, కోర్టు అతనికి జరిమానా కూడా విధించింది. ఈ కేసును మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు నిర్వహిస్తున్నారు.

Next Story