Siddipet : విషాదం.. పిల్ల‌ల‌ను చంపి.. త‌ను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు

కుటుంబ కలహాల కారణంగా నవంబర్ 10వ తేదీ ఆదివారం సిద్దిపేటలో 45 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు

By Kalasani Durgapraveen
Published on : 10 Nov 2024 8:00 PM IST

Siddipet : విషాదం.. పిల్ల‌ల‌ను చంపి.. త‌ను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు

కుటుంబ కలహాల కారణంగా నవంబర్ 10వ తేదీ ఆదివారం సిద్దిపేటలో 45 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని సిద్దిపేట పట్టణానికి చెందిన సత్యం ముదిరాజ్‌గా గుర్తించారు. అతను శిరీష అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు అనూష్ (7) కుమార్తె త్రివేణి (5) ఉన్నారు. శిరీషతో విడాకులు తీసుకున్నాక సత్యం మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తరచూ వివాదాల కారణంగా చివరికి రెండో భార్యతో కూడా విడాకులు తీసుకునే స్థితికి వచ్చాడు.

ఈ ఘటన అనంతరం శనివారం రాత్రి శిరీష నివాసానికి వెళ్లిన నిందితుడు ఆదివారం సెలవు కావడంతో పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఏమైందో ఏమో కానీ ఆ పిల్లలను నీటిలోకి తోసేసి తాను కూడా దూకి చనిపోయాడు. సిద్దిపేట పోలీసులు మీడియాతో మాట్లాడుతూ “ఏం జరిగిందో తెలియడం లేదు. ఆ వ్యక్తి పిల్లలను చింతల్ దగ్గర ఉన్న చెరువు వద్దకు వెళ్లి వారిని నీటిలోకి నెట్టాడు. ఆ తర్వాత సత్యం కూడా దూకేశాడు. మూడు మృతదేహాలను బయటకు తీశాము. ” అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story