ప్రాణం తీసిన చకినం

తెలంగాణలో చేసే సంప్రదాయ వంటకాల్లో చకినాలు ఒకటి. ప్రతీ ఇంట్లోనూ స్నాక్స్ లాగా లాగించేస్తూ ఉంటారు.

By Medi Samrat
Published on : 31 Jan 2024 8:07 PM IST

ప్రాణం తీసిన చకినం

తెలంగాణలో చేసే సంప్రదాయ వంటకాల్లో చకినాలు ఒకటి. ప్రతీ ఇంట్లోనూ స్నాక్స్ లాగా లాగించేస్తూ ఉంటారు. ఒక విచిత్రమైన సంఘటనలో, మంగళవారం నాడు ‘చకినాలు’ రుచి చూస్తుండగా 65 ఏళ్ల వ్యక్తి మరణించాడు. చకిన ముక్కను నోట్లో వేసుకుని తినబోతుండగా.. ఓ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గిల గిల లాడుతున్న ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లే లోపే మరణించాడు. మంచిర్యాలలోని హమాలివాడలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనపై మంచిర్యాల సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ ఎన్ రంగా రావు అనే వ్యక్తి చకినాల ముక్కను నోట్లో వేసుకున్నాడు. ఆ ముక్క ఆయన గొంతులో ఇరుక్కుంది. ఆయనను వెంటనే హాస్పిటల్ తరలించారు. రంగారావు అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. ఘటన జరిగిన సమయంలో ఆయన రాత్రి భోజనం చేస్తున్నారు.

Next Story