భార్య మ‌ట‌న్ వండ‌లేద‌ని 100 కు వ‌రుస‌పెట్టి ఫోన్లు.. పోలీసులు ఏం చేశారంటే..

Man booked for repeatedly dialling 100 to complain against wife refusing to cook mutton curry. మటన్ కూర వండేందుకు నిరాకరించిన భార్యపై ఫిర్యాదు చేసేందుకు ఎమర్జెన్సీ నంబర్

By Medi Samrat  Published on  21 March 2022 4:41 AM GMT
భార్య మ‌ట‌న్ వండ‌లేద‌ని 100 కు వ‌రుస‌పెట్టి ఫోన్లు.. పోలీసులు ఏం చేశారంటే..

హైదరాబాద్: మటన్ కూర వండేందుకు నిరాకరించిన భార్యపై ఫిర్యాదు చేసేందుకు ఎమర్జెన్సీ నంబర్ (100)కు చాలా సార్లు డయల్ చేసిన వ్యక్తిపై నల్గొండ పోలీసులు కేసు పెట్టారు. ఎటువంటి అవసరం లేకుండా 100కి డయల్ చేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

నిందితుడిని నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన నవీన్ (28)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఇంటికి వెళుతుండగా, మద్యం మత్తులో ఉన్న నిందితుడు మటన్ కొనుగోలు చేసి, తన భార్యను మటన్ కూర వండమని అడిగాడు. నవీన్‌ మద్యానికి బానిసైనందుకు నిందితుడి భార్య మటన్‌ కూర వండేందుకు నిరాకరించిందని కనగల్‌ ఎస్‌ఐ నగేష్‌ తెలిపారు. కోపోద్రిక్తుడైన నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి తన భార్య తనకు మటన్ కూర చేయడం లేదని ఫిర్యాదు చేశాడు. 100 సిబ్బంది మొదట నిందితుడు ఏదో పొరపాటున చేశాడని భావించారు. అయితే ఫోన్ కట్ చేసినా కూడా పలు మార్లు ఫోన్ చేస్తూనే వచ్చాడు. దీంతో సంబంధిత అధికారులకు ఆ నంబర్ గురించి ఫిర్యాదు చేశారు కాల్ సెంటర్ సిబ్బంది.

ఆరు సార్లు కాల్‌ చేసి.. చెప్పిందే చెప్పడం మొదలు పెట్టాడని ఎస్‌ఐ నగేష్ తెలిపారు. పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకోగా, అతడు మద్యం తాగి ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే అరెస్ట్ చేయలేదు. ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేసినందుకు వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 510, 290 కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి కేసు నమోదు చేశారు. అరెస్టు అనంతరం నవీన్ తాను మద్యం మత్తులో ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేశానని ఒప్పుకున్నాడు.













Next Story