తలసాని తలబిరుసు తనానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు : మల్లు రవి

Mallu Ravi Fire On Minister Talasani Srinivasa Yadav. పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. గాంధీ కుటుంబం పైన, ప్రియాంక గాంధీ పైన, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్

By Medi Samrat
Published on : 9 May 2023 8:15 PM IST

తలసాని తలబిరుసు తనానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు : మల్లు రవి

పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. గాంధీ కుటుంబం పైన, ప్రియాంక గాంధీ పైన, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. దేశం కోసం సకల సంపదలను, జీవితాన్ని త్యాగం చేసి చివరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ పైన శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దూరహంకారనికి నిదర్శనమ‌న్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరికలను తీర్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక గాంధీపైన విమర్శలు చేయడం ఆయన అవివేకం అన్నారు.

రేవంత్ రెడ్డిపైన తలసాని వ్యక్తిగత విమర్శలు ఆయన చేతగాని, చేవలేని తనానికి పరాకాష్ట అని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి యువకుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో చెప్పాలి.. అలా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి చేయలేదని అర్థం అవుతుందన్నారు. చెప్పడానికి ఏమి లేని వాళ్లే వ్యక్తిగత విమర్శలు చేస్తారు. తలసాని తలబిరుసు తనానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.


Next Story