మునుగోడు.. హుజురాబాద్ కాదు.. కాంగ్రెస్‌లో వుండి బీజేపీకి ప‌నిచేశాడు

Mallu Ravi Fire On Komatireddy Rajgopalreddy. రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సారధి.. సోనియా అందరి అభిప్రాయాలు

By Medi Samrat  Published on  6 Aug 2022 11:39 AM GMT
మునుగోడు.. హుజురాబాద్ కాదు.. కాంగ్రెస్‌లో వుండి బీజేపీకి ప‌నిచేశాడు

రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సారధి.. సోనియా అందరి అభిప్రాయాలు తీసుకొనే ఆయ‌న‌ని పీసీసీ చీఫ్ గా నియమించారని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆయన వ్యక్తి కాదు.. పార్టీ చీఫ్ అని స్ప‌ష్టం చేశారు. మునుగోడుకు వెళ్లేటప్పుడు ప్ర‌జ‌లు ఘనస్వాగతం పలికారని.. నిన్న చందూర్ మీటింగ్ కు 30వేల మంది వచ్చారని.. కానీ రేవంత్ ను టార్గెట్ చేస్తూ కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకముందే ఈటెల కూడా కామెంట్ చేశారని.. టీఆర్ఎస్ లో అన్ని పదవులు అనుభవించి మాట్లాడుతున్నారని.. పీడీఎస్ లో పనిచేశాడని ఈటెలను నమ్మారని అన్నారు. హుజురాబాద్ లో బిజెపి గెలిచినట్లు, టీఆరెస్ ఓడినట్లు కాదు.. కేసీఆర్ ను ఓడించాలని.. ఈటెలను గెలిపించారని అన్నారు.

మునుగోడు హుజురాబాద్ కాదు.. కాంగ్రెస్ లో వుండి రాజగోపాల్ బిజెపికి పనిచేస్తున్నాడని అందరికి తెలుసు. వరంగల్ రాహుల్ మీటింగ్ కు కూడా రాలేదు. కర్ణుడి రథసారధి సెల్యుడి తరహాలో రాజగోపాల్ పనిచేశాడ‌ని ఫైర్ అయ్యారు. రాజకీయాలు దిగజారడానికి మీరే కారణమ‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెసునే విమర్శిస్తున్నారని మండిప‌డ్డారు. దాసోజు శ్రవణ్ కు వలేసి బీజేపీ లోకి తీసుకున్నారని అన్నారు. రేవంత్ ను దెబ్బతీస్తేనే కాంగ్రెస్ వీక్ అవుతుందని విమర్శలు చేస్తున్నారని అన్నారు. దాసోజు చేసిన కామెంట్స్ ను ఖండించారు. పార్టీలో అన్ని కులాలకు ప్రాధాన్యత వుందని తెలిపారు. దాసోజుకు ఓపిక లేక బయటికి పోయారని అన్నారు. జాతీయ స్థాయిలో చాలా పెద్ద నాయకుడు అవుతాడు.. పార్టీ మారితే మరిండ్రు సరే.. కానీ కాంగ్రెస్ పై విమర్శలు చేయకండని సూచించారు.


Next Story
Share it