పార్టీలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పడం అబద్దం

Mallu Ravi Fire On Komatireddy Rajagopal Reddy. రాజకీయ జన్మ ఇచ్చిన కాంగ్రెస్ కు రాజగోపాల్ వెన్నుపోటు పొడిచార‌ని

By Medi Samrat  Published on  3 Aug 2022 1:45 PM GMT
పార్టీలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పడం అబద్దం

రాజకీయ జన్మ ఇచ్చిన కాంగ్రెస్ కు రాజగోపాల్ వెన్నుపోటు పొడిచార‌ని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమ‌ర్శించారు. బీజేపీలో చేరడానికి మోడీ, అమిత్ షాను పొగుడుతున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ ఆయ‌న‌కు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గా అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. మూడేళ్ళ క్రితం తిరుపతిలో బిజెపి బలమైన పార్టీ అని చెప్పార‌ని.. బిజెపికి మూడేళ్ళుగా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారని మండిప‌డ్డారు. కాంగ్రెస్ లోనే వుంటూ బిజెపికి పనిచేశారని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పని చేశార‌ని.. అధిష్టానం రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా అత్యంత ప్రజాస్వామ్య యుతంగా చేశారని తెలిపారు. జిల్లా, నియోజక వర్గ, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను తీస్కొని ప్రసిడెంట్ చేశారు.

రాజ‌గోపాల్‌ మాటలకు కాంగ్రెస్ శ్రేణులు సమాధానం చెబుతారని వెల్ల‌డించారు. రేవంత్ పీసీసీ ఛీప్ అయ్యాక దళిత గిరిజన ఆత్మ గౌరవ సభలు, నిరుద్యోగ జంగ్ సైరన్ లు చేసిండు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు రాహుల్ వచ్చారు. రైతు డిక్లరేషన్ విడుదల చేసినం. త్వరలో సిరిసిల్లలో యూత్ డిక్లరేషన్ విడుదల చేయాలనీ చూస్తున్నామ‌ని రేవంత్‌కు వ‌త్తాసు ప‌లికారు.

రాజ‌గోపాల్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారార‌ని విమ‌ర్శించారు. ఇందిరా హయాంలో జనతా పార్టీలో చేరిన వారంతా శంకర గిరి మాన్యాల్లో కలిసి పోయార‌ని.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వదిలిపెట్టిన వాళ్ళకు అదే గతిపడుతుంద‌ని జోస్యం చెప్పారు. ఈటెల కూడా అలా మాట్లాడ‌టం బాధాకరం.. డీకే అరుణ కూడా బాగా మాట్లాడుతుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గాలికి అన్ని పార్టీలు కొట్టుకుపోయాయని చెప్పారు. పార్టీలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పడం అబద్దమ‌ని మల్లు రవి అన్నారు.
Next Story
Share it