మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారంటూ కథనాలు వచ్చాయి. స్టూడెంట్స్ నుంచి వసూలు చేసిన సొమ్మును ఆదాయ పన్నులో చేర్చడంలో హెచ్చుతగ్గులు గుర్తించినట్లు వచ్చిన వార్తలను మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఖండించారు.
గతంలో ఈడీకి సంబంధించిన ఓ కేసు విషయంలో వరంగల్ పోలీసులు వెరిఫికేషన్ కోసం తమ ఇంటికి వచ్చారని, అంతకు మించి మరేమీ లేదని ప్రీతి రెడ్డి వివరణ ఇచ్చారు.
గతంలో ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సోదాలు నిర్వహించి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు.