ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

By -  Knakam Karthik
Published on : 10 March 2026 5:11 PM IST

Telangana, Phone Tapping Case, Supreme Court, Prabhakar Rao, IPS, Bail, SIT Investigation

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూనే, అరెస్ట్ నుంచి మినహాయింపునిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ వెసులుబాటుతో పాటు కోర్టు కొన్ని కఠినమైన షరతులను కూడా విధించింది. సిట్ విచారణకు ప్రభాకర్ రావు పూర్తిస్థాయిలో సహకరించాలని, కేసులోని సాక్ష్యాలను గానీ, ఆధారాలను గానీ తారుమారు చేసే ప్రయత్నం చేస్తే బెయిల్ వెంటనే రద్దవుతుందని కోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా, కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం లేదా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ కేసు నమోదయింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు పర్యవేక్షణలోనే ఈ అక్రమ ప్రక్రియ సాగిందని సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వంటి ఇతర ఉన్నతాధికారులు అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావుకు బెయిల్ లభించడం కేసులో కీలక పరిణామంగా మారింది.

Next Story