హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది. పది వేల మంది మహిళలతో సరూర్‌నగర్ స్టేడియంలో గిన్నిస్ రికార్డు సాధించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఈ వేడుకలను ప్రపంచస్థాయిలో చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. మొత్తం 63 అడుగుల ఎత్తు బతుకమ్మను ప్రతిష్టించి, 1500 మందితో బతుకమ్మ సాంగ్ రిహార్సల్స్ చేశారు.
సాయంత్రం నాలుగు గంటలకు పదివేల మంది మహిళలతో ఈ మహా బతుకమ్మ వేడుక జరగనుంది. కాగా అందరూ ఒకే స్టెప్పులు వేసేలా రిహార్సల్స్ పూర్తి చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ఈ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. కాగా మహాబతుకమ్మ వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొననున్నారు.