43 ఏళ్ల తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 7-9 తేదీల్లో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. 1982లో అప్పటి శృంగేరి పీఠాధిపతులు మహా కుంభాభిషేకం నిర్వహించారు. తాజాగా దేవాదాయ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులతో ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.
ఇటీవల జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు ఆలయ అధికారులు, అర్చకులను ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం తుని తపోవనం ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి బృందం నేతృత్వంలో శృంగేరి పీఠాధిపతి జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి వేడుకలు నిర్వహించనున్నారు.