సీఎం కేసీఆర్‌పై మధుయాష్కీ ఫైర్‌

Madhu Yashki Fires On CM KCR. దేశంలో మోదీ మతం పేరుతో లబ్ది పొందాలని చూస్తున్నార‌ని.. ఈ దేశం అన్ని

By Medi Samrat
Published on : 14 Aug 2021 3:49 PM IST

సీఎం కేసీఆర్‌పై మధుయాష్కీ ఫైర్‌

దేశంలో మోదీ మతం పేరుతో లబ్ది పొందాలని చూస్తున్నార‌ని.. ఈ దేశం అన్ని మతాల వారిదని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దగాకు గురయ్యారని ఆరోపించారు. కేసీఆర్ నరేంద్ర మోదీకి గులాంలా మారార‌ని.. మైనార్టీ ల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం.. సీఎం కేసీఆర్ జేబులో నుంచి పెట్టడం లేదని.. 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. దళిత బందు పథకం దళితులకు దొఖా చేసే పనేన‌ని మధుయాష్కీ అన్నారు. దళితులకు ఉద్యోగాలు కావాలి.. ఉపాధి కావాలి. దళిత బంధు పేరుతో పేలాలు వేసి.. కేసీఆర్ బిర్యానీ తింటున్నార‌ని విమ‌ర్శించారు.


Next Story