లాక్‌డౌన్‌ను పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

Lockdown Extended In Telangana. తెలంగాణలో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మ‌రో 10 రోజులు పొడిగించాలని

By Medi Samrat  Published on  8 Jun 2021 3:10 PM GMT
లాక్‌డౌన్‌ను పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మ‌రో 10 రోజులు పొడిగించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ భేటీ అయిన కేబినేట్ సుదీర్ఘంగా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఉద‌యం 6 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చారు. సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది.

కాగా.. కరోనా పూర్తిగా అదుపులోకిరాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం.. లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇదిలావుంటే.. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేఫ‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మే 12 నుంచి జూన్ 9 వ‌ర‌కూ లాక్‌డౌన్ విధించింది. లాక్‌డౌన్ రోజుల్లో ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రం నుంచి మిన‌హాయింపు ఉంది. ఈ స‌మ‌యంలో నిత్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు వెసులుబాటు క‌ల్పించారు.


Next Story