సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఆ మెట్రో స్టేషన్స్ బంద్

జీ20 సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతూ ఉంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన

By Medi Samrat  Published on  4 Sep 2023 1:35 PM GMT
సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఆ మెట్రో స్టేషన్స్ బంద్

జీ20 సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతూ ఉంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన భారత్ హాల్‌లో 18వ జీ20 సదస్సు 9, 10 తేదీల్లో జరగనుంది. 25 కంటే ఎక్కువ దేశాలకు చెందిన దేశాధినేతలు, ప్రపంచ సంస్థల అధిపతులు హాజరవ్వనున్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆరోజుల్లో ఢిల్లీ పోలీసులు ఢిల్లీ మెట్రోకు కూడా కొన్ని ఉత్తర్వులను జారీ చేశారు. సెప్టెంబర్ 8 నుండి 10 వరకు భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని మెట్రో స్టేషన్లు మూసివేయనున్నట్టు ప్రకటించారు. పోలీసులు జారీ చేసిన ఆదేశాల మేరకు మోతీ బాగ్, బికాజీ గామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు. ఈ మెట్రో స్టేషన్లలోకి ప్రయాణికులకు అనుమతి లేదు. పోలీసులు దౌలా గ్వాన్, ఖాన్ మార్కెట్, జనపథ్, సుప్రీంకోర్టు, బికాజీ గామా ప్లేస్ మెట్రో స్టేషన్లను హాట్‌స్పాట్ జాబితాలో చేర్చారు.ఈవెంట్ వేదికకు సమీపంలో ఉన్న సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ కూడా పూర్తిగా మూసివేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో కొన్ని ప్రవేశ ద్వారాలు మినహా యథావిధిగా నడుస్తుంది. ఢిల్లీ విమానాశ్రయం వైపు వెళ్లే ప్రయాణికులు 7వ తేదీ రాత్రి నుంచి 11వ తేదీ వరకు మెట్రో రైలును ఉపయోగించాలని సూచించారు.

Next Story