డిసెంబర్ 31 నాడు తెలంగాణలో మద్యం షాపులను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దీంతో మద్యం బాబులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇకపై న్యూఇయర్ రోజున మద్యం దొరకదనే సమస్య తీరినట్లే. తెలంగాణ ప్రభుత్వం బార్లు రెస్టారెంట్లను అర్ధరాత్రి 1 గంట వరకు తెరచి ఉండవచ్చని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈవెంట్లను రాత్రి 1 గంట వరకు జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకోడానికి అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకోవచ్చు. ఇక అన్ని వైన్‌షాపులను ఆ రోజు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు.