తెలంగాణలో ఏరులై పారిన మ‌ద్యం.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు

Liquor sales highest in 2021 in Telangana.కొత్త సంవ‌త్స‌రానికి మందుబాబులు త‌మ‌దైన రీతిలో స్వాగ‌తం ప‌లికారు. 2020లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2022 4:34 AM GMT
తెలంగాణలో ఏరులై పారిన మ‌ద్యం.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు

కొత్త సంవ‌త్స‌రానికి మందుబాబులు త‌మ‌దైన రీతిలో స్వాగ‌తం ప‌లికారు. 2020లో క‌రోనా ఆంక్ష‌ల దృష్ట్యా కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల సంద‌ర్భంగా మంద‌కొడిగా సాగిన మ‌ద్యం అమ్మకాలు 2021లో మాత్రం దూసుకుపోయాయి. ఐదురోజుల్లోనే రూ.902 కోట్లకు పైగా మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగాయంటే మందుబాబులు ఎంత‌లా తాగారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక డిసెంబ‌ర్ నెల విక్ర‌యాల్లోనూ రికార్డులు బ‌ద్ద‌లు అయ్యాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా రూ.3,435 కోట్ల‌కు(2020 డిసెంబరులో రూ.2764 కోట్లు) అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు జ‌రిగిన‌ట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

డిసెంబరు 27న 202.42 కోట్లు, 28న 155.48 కోట్లు, 29న రూ.149.53, 30న రూ.246.56 కోట్లు, 31న రాత్రి 7 గంటల వరకు రూ.148.52 కోట్ల అమ్మకాలు సాగాయి. 2020లో మొత్తం రూ.25,601.39 కోట్ల అమ్మకాలు జరగ్గా.. 2021లో శుక్రవారం సాయంత్రానికే రూ.30,196 కోట్ల మేర నమోదయ్యాయి. మొత్తంగా ఏడాదంతా 3,68,68,975 కేసుల లిక్కర్‌, 3,25,82,859 కేసుల బీర్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ లెక్క‌లు చెబుతున్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా రూ.6,979 కోట్ల మద్యం అమ్మకాలు జ‌రిగాయి. ఆ తర్వాత నల్గొండ రూ.3,288 కోట్లు, హైదరాబాద్‌ రూ.3,201 కోట్ల అమ్మకాలు జరిగాయి.

Next Story