రేపు మద్యం, మాంసం షాపులు బంద్
అక్టోబర్ 2న గాంధీ జయంతి అంటే ఆ రోజు ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు మూసివేసే ఉంటాయి
By - Knakam Karthik |
రేపు మద్యం, మాంసం షాపులు బంద్
తెలంగాణలో దసరా పండుగ అంటేనే చుక్క, ముక్క అన్నట్లు సాగుతుంది. కానీ ఈ సారి పండుగకు భారీ షాక్ తగిలింది. ముందుగా ప్లాన్ చేసుకుని మద్యం, మటన్, చికెన్ ఆర్డర్ పెట్టుకుంటేనే దొరికేలా ఉంది. ఎందుకంటే దసరా రోజు ఈ షాపులు బంద్ కానున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి అంటే ఆ రోజు ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు మూసివేసే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాయి.
తాజాగా, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జీహెచ్ఎంసీ పరిధిలోని వధశాలలు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం1955లోని 533(బీ) విభాగం ప్రకారం ఇటీవల జరిగిన సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. సోమవారం అధికారిక ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఎవరైనా మాంసం లేదా మద్యం విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు.. వైజాగ్లో జీవీఎంసీ కూడా అవే ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దసరా రోజున మద్యం, మాంసం విక్రయాలను బంద్ చేయనున్నాయి.