మెస్సీ ఈవెంట్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు : సీఎం రేవంత్

ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

By -  Medi Samrat
Published on : 11 Dec 2025 8:42 PM IST

మెస్సీ ఈవెంట్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు : సీఎం రేవంత్

ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెస్సీ పర్యటనను ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోందని, ప్రభుత్వం కేవలం అవసరమైన సహకారం మాత్రమే అందిస్తోందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నగరానికి వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమానికి తాను కూడా ఒక అతిథిగా మాత్రమే హాజరవుతున్నానని చెప్పారు. ఈ ఈవెంట్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఈ నెల 13న మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆయన పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు కూడా రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నారు.

Next Story