వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లింక్.. కేటీఆర్ సంచలన వీడియో రిలీజ్
కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
By అంజి Published on 25 Aug 2024 2:26 PM IST
వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లింక్.. కేటీఆర్ సంచలన వీడియో రిలీజ్
కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారని, అవి ఎవరి అకౌంట్లు అని ట్వీట్‌లో ప్రశ్నించారు. తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతుందని విమర్శలు చేశారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఈ డబ్బులనే ఖర్చు చేసినట్లు అనిపిస్తోందని ఆరోపణలు చేశారు.
''వీ6 బిజినెస్ యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు? లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో నగదు విత్‌డ్రా చేయబడిన బార్‌లు, బంగారు దుకాణాలు ఎవరివి? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి? హైదరాబాద్ కు ఇన్ని లింకులు కనపడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారు'' అని కేటీఆర్ ప్రశ్నించారు.
సిద్ధరామయ్యను తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్ఖిహొలీ అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న బంధం వాల్మీకి స్కామేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఈ స్కాం గురించి నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
✳️ కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్!✳️ హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?✳️ "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?✳️… pic.twitter.com/0X1DiQIh4b
— KTR (@KTRBRS) August 25, 2024