రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కారణంగా ప్రజలు భయం భయంగా గడుపుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  3 Aug 2024 7:52 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కారణంగా ప్రజలు భయం భయంగా గడుపుతూ ఉన్నారు. చందుర్తి మండలం దేవునితండాలో శనివారం తెల్లవారుజామున చిరుతపులి ఓ ఆవును చంపేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి రైతు సారిలాల్ తన వ్యవసాయ పొలంలో ఉన్న పశువుల కొట్టంలో ఆవును వదిలిపెట్టాడు. ఉదయం పొలానికి వెళ్లి చూడగా ఆవు కాస్తా శవమై కనిపించింది. తెల్లవారుజామున ఆవుపై చిరుతపులి దాడి చేసి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

కొద్దిరోజుల కిందట నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లిపోయింది. అర్ధరాత్రి సున్నిపెంటలోని రామాలయం సమీపంలో చిరుత కలకలం రేపింది. అర్ధరాత్రి ఎత్తయిన ప్రహరీ గోడ దూకి ఓ ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంటి అరుగుపై ఉన్న రెండు పెంపుడు కుక్కలపై దాడి చేసింది చిరుత. చిరుత దాడిలో రెండు కుక్కలూ చనిపోయాయి. ఓ కుక్కను అక్కడే వదిలి మరో కుక్కను నోటకరుచుకుని చిరుత వెళ్ళిపోయిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Next Story