కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూపై ఏసీబీకి న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 7 Dec 2023 8:00 PM ISTకాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూపై ఏసీబీకి న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు, కవిత, మేఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు. తప్పుడు అంచనాల ద్వారా రూ.వేలాది కోట్లు దోపీడీ జరిగిందని భాస్కర్ చెప్పారు. తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని, ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని రాపోలు భాస్కర్ కోరారు.
రాపోలు భాస్కర్ గతంలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన పాత్రికేయుడు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవాలని ప్రణాళిక రచించారని దీనిపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని న్యాయవాది రాపోలు కోరారు. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి కాళేశ్వరం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
2014 నుంచి 2018 వరకు నీటిపారుదలశాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉండగా.. రెండో విడత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆరే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో ఏసీబీ దీనిపై కేసు నమోదు చేస్తే.. ఈ ఇద్దరికీ ఇబ్బంది తప్పదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటు మెఘా కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రభుత్వం మారగానే ఇలా ఏసీబీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం.. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.