తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన జరిగింది. కోర్టు హాలులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ గుండెపోటుతో కుప్పకూలారు. ఈ ఘటన తోటి న్యాయవాదులను తీవ్రంగా కలచివేసింది. లాయర్ వేణుగోపాల రావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆయన్ను గమనించిన తోటి లాయర్లు వెంటనే వేణుగోపాలరావును అంబులెన్సులో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.
కాగా మార్గమధ్యలోనే వేణుగోపాల రావు మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. న్యాయవాది మృతికి సంతాప సూచకంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ ఎమర్జెన్సీ పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్ పిటిషన్లు వాయిదా వేశారు.