అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ ఇంటి పై పోలీసుల దాడి

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు.

By అంజి
Published on : 15 Nov 2023 2:55 AM

police raid, Congress, Madhuyashki Goud, Hyderabad

అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ ఇంటి పై పోలీసుల దాడి

తెలంగాణలో ఎన్నికల వేళ పలు రాజకీయ నాయకుల ఇళ్లలో పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. అనుమతి లేకుండానే పోలీసుల బృందం ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడింది. సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్కీ ఇంటిపై దాడి చేయడంపై కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఇటువంటి పనులకు పాల్పడుతున్నారాని మధు యాష్కీ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదని అన్నారు.

పోలీసులపైనా ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. మధుయాష్కీ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందన్న సమాచారంతో పోలీసులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే అసలు ఫిర్యాదు ఎవరు ఇచ్చారు? సెర్చ్ వారెంట్ ఏది? అంటూ పోలీసులను మధుయాష్కీ ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు సైతం మద్దతుగా మధుయాష్కీ నివాసం వద్దకు చేరుకున్నాయి. దీంతో అర్ధరాత్రి హయత్‌నగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ నివాసం ఇంటిపై పోలీసుల దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలంగాణ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.


Next Story