తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు!

హైదరాబాద్‌: రెవెన్యూ లక్ష్యంగా భూముల ధరలను భారీగా పెంచే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.

By -  అంజి
Published on : 7 Oct 2025 9:53 AM IST

Land prices, Telangana, ORR, RRR, Hyderabad

తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు!

హైదరాబాద్‌: రెవెన్యూ లక్ష్యంగా భూముల ధరలను భారీగా పెంచే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. హైదరాబాద్‌ శివార్లలోని కోర్‌ అర్బన్‌ ఏరియాలో (ఓఆర్‌ఆర్‌ బయట - ఆర్‌ఆర్‌ఆర్‌ పరిధి లోపల) భూముల మార్కెట్‌ ధర సగటున 30 శాతం, ప్లాట్స్‌ 50 శాతం పెరగవచ్చు. కొన్ని చోట్ల వ్యాల్యూ పెంపు 100 శాతం కూడా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. జోన్ల వారీ వ్యాల్యూ పెరుగుదల ఫైల్స్‌ ఆమోదముద్ర కోసం సీఎంవోకు చేరాయి. సీఎం పరిశీలించి సంతకం చేస్తే త్వరలో భూమలు ధరలు పెరుగుతాయి.

2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 20 శాతం పెంచగా, 2022లో మళ్లీ 33 శాతం పెంచారు. అప్పటి నుంచి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2023లోనే భూముల ధరలు సవరించాలని అనుకున్నా, అమలు కాలేదు. ఇప్పుడు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సవరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సారి ఏకంగా 20 నుంచి 30 శాతం భూముల విలువ పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వ్యవసాయ భూములు సహా అన్ని రకాల భూముల విలువలు పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని రాయదుర్గంలో 7.67 ఎకరాల భూమి ₹1357.59 కోట్లకు అమ్ముడుపోవడంతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) కొత్త రికార్డు సృష్టించింది. తాజా వేలంలో.. ఎకరం భూమి ₹177 కోట్లకు అమ్ముడైంది, ఇది కోకాపేటలోని నియోపోలిస్‌లో ఎకరానికి ₹100.75 కోట్ల రికార్డును అధిగమించింది. రాయదుర్గం వేలంలో ప్రముఖ జాతీయ, ప్రాంతీయ డెవలపర్లు విశేషమైన భాగస్వామ్యం వహించారు. ఇది హైదరాబాద్ యొక్క స్థిరమైన ఆర్థిక వృద్ధి, వేలం ప్రక్రియ యొక్క పారదర్శకత, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి కేంద్రంగా రాయదుర్గం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విజయం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విధాన చట్రాన్ని, పాలనను కూడా హైలైట్ చేస్తుంది.

Next Story