లేడీ అఘోరీకి రిమాండ్..జైలులోనూ భార్య వర్షిణితోనే ఉంటానని కామెంట్స్
లేడీ అఘోరీకి హైదరాబాద్ మోకిలా పోలీసులు షాక్ ఇచ్చారు.
By Knakam Karthik
లేడీ అఘోరీకి రిమాండ్..జైలులోనూ భార్య వర్షిణితోనే ఉంటానని కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో నిలుస్తూ..ఇటీవలే బీటెక్ అమ్మాయిని వివాహం చేసుకున్న లేడీ అఘోరీకి హైదరాబాద్ మోకిలా పోలీసులు షాక్ ఇచ్చారు. పూజల పేరిట ఓ మహిళను రూ.9.80 లక్షల మేర మోసం చేసిందనే ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. లేడీ అఘోరీ పూజల పేరుతో తన వద్ద రూ.9.80 లక్షలు వసూలు చేసి మోసం చేసిందని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిబ్రవరి 25న మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లేడీ అఘోరీని ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు లేడీ అఘోరీ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి శ్రీనివాస్‌ను మోకిల పోలీసులు అరెస్టు చేశారు.
కాగా అఘోరీని మోకిలా పోలీస్ స్టేషన్‌లో రెండు గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య బృందం పరీక్షలు చేయడంతో అఘోరీని పోలీసులు అక్కడ నుంచి రిమాండ్‌కు తరలించారు. అయితే జైలుకు వెళ్లినా కూడా తన భార్య తనతోనే ఉంటుందని అఘోరీ తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అఘోరీ అన్నారు. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, నేను జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణి తనతో పాటే ఉంటుందని అఘోరీ అన్నారు.