ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన‌ కూసుకుంట్ల

Kusukuntla Prabhakar Reddy who took oath as MLA. మునుగోడు శాసనసభ్యుడిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు

By Medi Samrat  Published on  10 Nov 2022 12:05 PM IST
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన‌ కూసుకుంట్ల

హైదరాబాద్ : మునుగోడు శాసనసభ్యుడిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లో శాసనసభాప‌తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. శాస‌న‌స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నేత‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్, తుంగతుర్తి శాసనసభ్యుడు డా.గాదరి కిశోర్ కుమార్ తదితరులు హాజ‌ర‌య్యారు.


Next Story