బీజేపీ ఓడిపోతే అస్త్ర సన్యాసం చేస్తావా? బండికి కూనంనేని సవాల్

Kunamneni Sambashiva Rao Fire On Bandi Sanjay. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి ఓట్ల ఓసం డబ్బులు పంచలేదని

By Medi Samrat  Published on  5 Nov 2022 12:54 PM GMT
బీజేపీ ఓడిపోతే అస్త్ర సన్యాసం చేస్తావా? బండికి కూనంనేని సవాల్

ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి ఓట్ల ఓసం డబ్బులు పంచలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేస్తారా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. అప్పుడే బండి సంజయ్ చేసే ప్రమాణాలకు విలువ ఉన్నట్టు గుర్తిస్తామన్నారు. ఎంఎల్ కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ పోలీసులకు ధైర్యముంటే ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ కుట్ర సెక్షన్లను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వరవరరావు, సాయిబాబపైన కుట్ర కేసులు పెట్టినట్టే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన వారిపైన కూడా కేసు నమోదు చేయాలన్నారు. అవినీతికి కేంద్ర బింధువు, అవినీతి పుట్టపైన కుర్చన్నదే ప్రధాని మోడీ అని, ఆయన తన వ్యక్తిగతంగానో, పార్టీనా ఎవరి కోసం అనేది తెలియదన్నారు.

సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పశ్యపద్మ, ఈటి నరసింహాతో కలిసి హైదరాబాద్ మగ్ధూంభవన్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రధాని మోడీ చెబుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో బిజెపి తరుపున ఎవ్వరూ డబ్బులు పంచలేదని బండి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్‌ కంటే కూడా బిజెపి ఎక్కువ డబ్బులను పంపిణీ చేసినట్లు తాను విన్నానని తెలిపారు. ప్రతి దానికి బండి సంజయ్, తరుణ్ చుగ్ దెయ్యం పట్టినట్లు దేవుడి మీద ప్రమాణం చేయాలంటున్నారని, తాను అడిగిన దానిపై చేయగలరా అన్ని అన్నారు. సిబిఐ, ఈడి, ఎన్నికల కమిషన్ ఇలా రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోడీవేనా? అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుట్ర కేసుల్లో ఇది వరకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టే ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 8 రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టిన విషయం బయటకు వచ్చిందని, ఈ వీడియో క్లిప్పింగ్ సిఎం కెసిఆర్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులకు, సిబిఐ, ఈడిలకు పంపించారని, దీనిని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని కోరారు. బండిసంజయ్,తరుణ్ ప్రమాణాల దెయ్యం పట్టిందని, అనేక ప్రేలాపాలు చేస్తున్నారన్నారు. ఇంగీత జ్ఞానం, వివేకం లేనివాళ్లు తెలంగాణ రాష్ట్రానికి తామే ప్రత్యామ్నామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల పరిణామాలను పరిశిలిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా? లేదా నిరంకుశ వ్యవస్థలో ఉన్నామా?, ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులు పాలిస్తున్నాయా? అనే భావన కలుగుతుందని కూనంనేని అన్నారు.

రాజనీతిజ్ఞుడుగా ఉండాల్సిన ప్రధాని మోడీ ఒక జిల్లా , గ్రామ స్థాయి నాయకునిగా వ్యవహారిస్తూ దిగజారి, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు. దేశానికి చౌకీదారుగా ఉంటానని చెప్పిన ప్రధాని మోడీనే తన స్వార్థం, అధికారంలో కోసం, దేశాన్ని అన్ని రంగాల్లో అపఖ్యాతి చేస్తూ అన్నింటినీ స్వాహా చేస్తున్నారని విమర్శించారు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అని, ఏ రాష్ట్రాలలోనైనా ఫిరాయింపులను ప్రొత్సహించడం తప్పు అని అన్నారు. గోద్రా కేసులో నేరచరిత ఉన్న ప్రదాని మోడీ, గుజరాత్ రాష్ట్ర నుండి బహిష్కరణ వేటు పడిన అమిత్ షాలు తమ పాత చరిత్రను మర్చిపోలేదన్నారు. తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలను కూడా మింగేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, దొరికిన పీఠాధిపతులు బిజెపికి చెందిన వారేనన్నారు. సిఎం కెసిఆర్ సొంతంగా స్క్రీప్ట్ రాసుకున్నారని చెబుతున్న బండి సంజయ్ తలలో బుర్ర లేదని ఎద్దేవా చేశారు. ఎవరైనా పీఠాధిపతులు తాము కేసులో ఉంటామని ముందుకొస్తారా అని ప్రశ్నించారు. ఓట్లను ఎంఎల్ కొనుగోలు చేస్తే, ఆ ఎంఎల్ పార్టీ కొనుగోలు చేస్తోందని విమర్శించారు.

బీజేపీ ఓడిపోతే అస్త్ర సన్యాసం చేస్తావా? బండికి కూనంనేని సవాల్

మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపినే గెలుస్తుందని చెబుతున్న బండి సంజయ్ ఒక వేళ టిఆర్ఎస్ గెలిస్తే రాజకీయ అస్త్ర సన్యాసం లేదా తన ఎంపి పదవికి రాజీనామా చేస్తారా? అని కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు. సిపిఐ మద్దతుతో మునుగోడులో టిఆర్ గెలుస్తుందని, బిజెపికి చెంపపెట్టు సమాధానం రాబోతుందన్నారు. సిపిఐలో అనేక చర్చల తర్వాత తీసుకునే నిర్ణయానికి పై నుండి కింది వరకూ అందరూ కట్టుబడి ఉంటారని, తమ సిద్ధాంతాల కోసం అవసరమైతే బలిదానాలకైనా కమ్యూనిస్టులు సిద్ధమేనన్నారు. బిజెపిని ఓడించేందుకు చివరి వరకు తమ పోరాటం సాగుతుందని, అందుకు ఆ పార్టీని వ్యతిరేకించే ఎవరితోనైనా కలుస్తామని, ఆ పార్టీని రాష్ట్రంలో ఎదగనివ్వబోమన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలు, ఎంఎల్ కొనుగోలు కేసుతో సంబంధం ఉన్నవారిపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తామన్నారు.

Next Story
Share it