సీఎం రేవంత్ కంప్యూటర్ కామెంట్స్‌పై కేటీఆర్ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చిట్టినాయుడు సుభాషితాలు అంటూ ఎద్దేవా చేశారు. ''కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ కాదు.. చార్లెస్ బాబేజీ. దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ కాదు. టీఐఎఫ్ఆర్ఏసీ వారు 1956లో ఇక్కడ కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్‌కు అప్పటికి 12 ఏళ్లు. నోటికొచ్చింది వాగి దొరికిపోవడం ఎందుకు? నీకు బాగా తెలిసిన రియల్టీ దందాలు, బ్లాక్ మెయిల్‌కి పరిమితమైతే మంచిదమ్మా చిట్టి'' అని ట్వీట్ చేశారు.
అంతకుముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇప్పుడు ట్విటర్ పిట్ట ట్విటర్లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూటర్ను పుట్టింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని అన్నారు. ''లేకపోతే నువ్వు (కేటీఆర్) గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వే స్టేషన్లో చాయ్, సమోసా అమ్ముకునేవాడివి'' అని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.