కిషన్ రెడ్డిని లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తాం

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు ధీమా వ్యక్తం చేశారు

By Medi Samrat  Published on  1 April 2024 1:30 PM IST
కిషన్ రెడ్డిని లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తాం

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్‌సభ ఎంపీ కిషన్‌రెడ్డి ఓటమి ఖాయమన్నారు. కిషన్‌రెడ్డి హయాంలో గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో చెప్పుకోదగ్గ ఆర్థిక కేటాయింపులు కూడా సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో జరగలేదని ఆయన నొక్కి చెప్పారు.

అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో కిషన్‌రెడ్డిని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఆయన ఏమేమి చేశారో చెప్పాలని.. ఆ తర్వాతే ఓటు అడగాలని కేటీఆర్ సవాలు విసిరారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఓటర్లు బీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. పార్టీ సమగ్ర అభివృద్ధిలో మంచి ట్రాక్ రికార్డ్ ఉందని అన్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన కేటీఆర్ BRS పార్టీకి, సికింద్రాబాద్ LS అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గౌడ్ పాత్రను ప్రస్తావించిన కేటీఆర్, పద్మారావు గౌడ్‌ అందరికీ అందుబాటులో ఉంటారని.. అంకితభావంతో కూడిన నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఓటర్లను కోరారు.

Next Story