గ్రౌండ్ రియాలిటీలో చాలా తేడా ఉందంటూ రాహుల్ కు కేటీఆర్ లేఖ

పంట రుణాల మాఫీ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

By అంజి  Published on  18 Aug 2024 3:00 PM GMT
KTR, Rahul Gandhi, Mallikarjun Kharge, Farmer Loan Waiver

గ్రౌండ్ రియాలిటీలో చాలా తేడా ఉందంటూ రాహుల్ కు కేటీఆర్ లేఖ

పంట రుణాల మాఫీ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు లేఖ రాశారు.

పంట రుణాల మాఫీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన లక్షలాది మంది తెలంగాణ రైతుల తరపున తాను లేఖ రాస్తున్నానని కేటీఆర్ తెలిపారు. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీని ఇచ్చారని రాహుల్ గాంధీకి కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, గ్రౌండ్ రియాలిటీలో కథ వేరేలా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించగా.. అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది రైతులను ఈ పథకం నుండి మినహాయించారన్నారు. తెలంగాణలో లక్షల సంఖ్యలో రైతులు ఉండగా, వారిలో రుణమాఫీ అందనివారే ఎక్కువమంది ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, కానీ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతపెట్టారనన్నారు.

Next Story