ఏసీబీ విచారణకు హాజరుకాకుండా వెళ్లిపోయిన కేటీఆర్‌

ఫార్ములా ఈ కేసులో విచారణకు లాయర్లతో పాటు అనుమతించకపోవడంతో కేటీఆర్‌ వెనక్కి వెళ్లిపోయారు. ఏసీబీ అధికారుకు తన లేఖ ఇచ్చి పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

By అంజి  Published on  6 Jan 2025 12:02 PM IST
KTR, ACB investigation, Formula-E car race case, Hyderabad

ఏసీబీ విచారణకు హాజరుకాకుండా వెళ్లిపోయిన కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కేసులో విచారణకు లాయర్లతో పాటు అనుమతించకపోవడంతో కేటీఆర్‌ వెనక్కి వెళ్లిపోయారు. ఏసీబీ అధికారుకు తన లేఖ ఇచ్చి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అటు అంతకుముందు ఏసీబీ కార్యాలయం మందు కేటీఆర్‌ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు ఎవరూ కేటీఆర్‌ వెంట వెళ్లకూడదంటూ పోలీసులు వాహనాన్ని ఆపేశారు. చట్టం ప్రకారం పౌరుడికి ఉన్న హక్కులను వినియోగించుకోనివ్వాలని కేటీఆర్‌ కోరారు.

మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి.. కుట్రలో భాగంగానే పోలీసులు తనను విచారణకు పిలిచారని ఆరోపించారు. ఖాకీలు రాజమౌళి కంటే బెటర్‌ కథలు రాస్తున్నారని కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు భరోసా అమలు చేయని రేవంత్‌ ఆ టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకే ఏసీబీ డ్రామా చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. అటు తనను ఏసీబీ ఆఫీస్‌కు పిలిచి ఇంట్లో రైడ్స్‌ చేయించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఆఫీసులో తనతో పాటు న్యాయవాదులు వస్తే ఇబ్బందేంటని ప్రశ్నించారు.

Next Story