బాల్క సుమన్ అరెస్ట్‌పై భగ్గుమన్న కేటీఆర్, హరీశ్‌రావు

మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌లపై రాళ్ల దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు

By -  Knakam Karthik
Published on : 18 Feb 2026 7:16 PM IST

Telangana, KTR, BalkaSuman, BRS Party, Kyathanpally, Telangana Politics

బాల్క సుమన్ అరెస్ట్‌పై భగ్గుమన్న కేటీఆర్, హరీశ్‌రావు

మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌లపై రాళ్ల దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.

కేటీఆర్ వార్నింగ్: "క్యాతనపల్లిని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలనే కుట్రతోనే ఈ అక్రమ అరెస్టు చేశారు. బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా, రేవంత్ సర్కార్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. పోలీసు అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక ఈ దుర్మార్గాలన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తాం" అని కేటీఆర్ హెచ్చరించారు.

హరీశ్‌రావు ఆగ్రహం: "బాల్క సుమన్ అరెస్ట్ అప్రజాస్వామికం. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతోంది. హంగ్ వచ్చిన ప్రతిచోటా అడ్డదారుల్లో పీఠాలను కబ్జా చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ తీరును తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది" అని హరీశ్‌రావు మండిపడ్డారు.

Next Story