ఆ రెండు శాఖలకు ఆయనే మంత్రి.. నిజాలు ఎలా బయటకు వస్తాయి.? : కేటీఆర్
పొన్నం మాటలతో ఫార్మిలా కేసులో అవినీతి లేదని తేలిందని కేటీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 10:15 AM GMTపొన్నం మాటలతో ఫార్మిలా కేసులో అవినీతి లేదని తేలిందని కేటీఆర్ అన్నారు. హెచ్ఎండీఏ ఒక కార్పోరేషన్ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉంది.. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు.. దానికి ఆ మేరకు స్వతంత్రత ఉంది. ముఖ్యమంత్రా.. లేదా ఇతరులెవరైనా మంత్రులు కొంత మంది సైకోలు తప్పుదోవ పట్టిస్తున్నారో తెలవాలన్నారు. లంచ్ మోషన్ పైన కోర్టు తేలుస్తుందన్నారు. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకు పోతే వాళ్ల ఇష్టం.. న్యాయ పరంగా తేల్చుకుంటామన్నారు.
ఓఆర్ఆర్ రోడ్డు లీజు.. సిట్ ఎర్పాటుపైన కూడా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఓటీ దేశంలో ఇప్పటికే అమలులో ఉందని.. టీఓటీ విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించామని తెలిపారు. ఆర్థిక వనరుల సమీకరణపైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చిందన్నారు. అమెరికా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించింది.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీఓటీ విధానంలోనే అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించామని వివరించారు.
ప్రయివేట్ కంపెనీకి లబ్ది చేకూర్చినట్టు అరోపిస్తున్న రేవంత్.. ఆ కంపెనీతో లీజును ఎందుకు రద్దు చేయడం లేదు అని ప్రశ్నించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన లక్ష కోట్ల అవినీతి అడ్డగోలు మాటలపైన హెచ్ఎండిఏ పరువు నష్టం కేసు వేసింది.. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన హెచ్ఎండిఏ వేసిన కేసు అలాగే ఉందన్నారు. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డుపైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారు.. మరి ఎందుకు కుంభకోణం అంటున్న అవుటర్ రింగ్ రోడ్డు లీజ్ ను రద్దు చేయడం లేదని అడిగారు.
రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారు.. ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయన్నారు. తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలి.. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు రీజనింగ్ వెంటనే రద్దుచేసి… సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలన్నారు.
ఒకవేళ కుంభకోణం జరిగివుంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీ కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే.. ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారన్నారు. జడ్జ్ ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తామన్నారు. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలన్నారు.
పదివేల కోట్ల రూపాయల కోకాపేట కుంభకోణం అంటున్న భూముల అమ్మకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలన్నారు. ప్రభుత్వం సభ్యులకు స్పీకర్, ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్లు, పేపర్లు విసరడం ఏలా అని శిక్షణ ఇచ్చారన్నారు. స్పీకర్ ను కూడా దళితుడు, దళితుడు అంటూ పదే పదే చెప్పడం అయన గౌరవాన్ని తగ్గించేలా చేయడమేనన్నారు.