కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

తన క్యారెక్టర్‌పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

By అంజి  Published on  22 Oct 2024 6:13 AM GMT
KTR, defamation case, Minister Konda Surekha, Telangana

కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

హైదరాబాద్‌: తన క్యారెక్టర్‌పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మంత్రి కొండా సురేఖ దురుద్దేశపూరితమైన, చౌకబారు వ్యాఖ్యలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్టు పేర్కొన్నారు. గత కొంత కాలంగా తన క్యారెక్టర్‌ను దిగజార్చేందుకు సోషల్‌ మీడియాలో చేసే ప్రయత్నాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. కోర్టులో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు.

''ప్రజాప్రతినిధిగా, నేను ఎల్లప్పుడూ వ్యక్తిగత వివాదాల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాను, కానీ ఇది ఒక గీతను గీయడానికి సమయం. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు వాక్చాతుర్యాన్ని ప్రచారం చేయవచ్చని భావించే వారికి ఈ వ్యాజ్యం ఒక గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నాను. కోర్టులో నిజం గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది'' అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Next Story